కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి గ్రామపంచాయతీలో ఓ బాలుడు శనివారం సెలవు కావడంతో తల్లితో కలిసి పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నాడు. చిన్న వయసులోనే తల్లికి తోడుగా నిలిచి చెత్త తొలగింపు పనుల్లో సహాయం చేశాడు. బాధ్యతాయుతమైన ఈ దృశ్యం గ్రామస్తుల మనసులను హత్తుకుంది. ఈ బాలుడి మానవీయతకు ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.