NTR: జగ్గయ్యపేట మార్కెట్ యార్డు ఛైర్మన్గా పదవి చేపట్టనున్న సీతమ్మను నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు ఇవాళ సన్మానించారు. విలియంపేట, మల్లెల కొండా ఇంటి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రామారావు, నియోజకవర్గ నాయకులు దుర్గా మహేశ్వరరావు, 14, 23వ వార్డుల కౌన్సిలర్ వెంకట్, జోజి, తెలుగు యువత కార్యదర్శి రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.