SS: హిందూపూర్‌లో శనివారం జరుగుతున్న నవోదయ పాఠశాలల ప్రవేశ పరీక్ష కేంద్రాలను పెనుకొండ డివిజన్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. భద్రతా ఏర్పాట్లను కూడా సమీక్షించారు.