KMM: నేలకొండపల్లి మండలంలోని కొత్త కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ శనివారం పరిశీలించారు. ఆమె బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రి సరఫరా ప్రక్రియను పర్యవేక్షించి, ఎన్నికల సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. సిబ్బంది జాగ్రత్తగా విధులను నిర్వహించాలని ఆమె ఆదేశించారు.