MNCL: జిల్లాలో శనివారం జవహర్ నవోదయ విద్యాలయలో ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాల్లోని ఏడు కేంద్రాలలో జరిగిన పరీక్షకు మొత్తం 1722 మంది విద్యార్థులకు 1267 మంది విద్యార్థులు హాజరవగా.. 455 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల పాఠశాల, కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో పరీక్షా కేంద్రాలను డీఈఓ యాదయ్య సందర్శించారు.