KNR: జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష జరుగుతున్న కరీంనగర్ లోని భగవతి పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును, కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.