AP: రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4,929 మంది పెన్షన్లపై పునరాలోచన చేసిన త్రిసభ్య కమిటీ.. రద్దు అయినవాటిపై దరఖాస్తుల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గ్రామసభల సమయంలో అర్జీలు సమర్పించవచ్చని, భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని AP CRDA తెలిపింది. అటు అర్హులైనవారికి నెలకు రూ.5 వేల పెన్షన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.