KNR: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధుల కేటాయింపుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ర్యాండమైజేషన్ ప్రక్రియలో జరిగిన తప్పిదాల కారణంగా, ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు, బదిలీపై వేరే జిల్లాకు వెళ్లిన ఉద్యోగులు కూడా విధులకు హాజరు కావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల ఉద్యోగుల్లో అయోమయం, ఆందోళన పెరిగింది.