SS: మడకశిర నియోజకవర్గంలో YCP, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. గోవిందపురం గ్రామానికి చెందిన వార్డు మెంబర్లు సిద్ధేశ్, రామాంజి సహా పది కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆగళి, రామనపల్లి పంచాయతీలకు చెందిన సర్పంచ్, ఎంపీటీసీలు, ఇతర వైసీపీ నాయకులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.