కృష్ణా: పెడన పట్టణంలో జరుగుతున్న శ్రీ పైడమ్మ అమ్మవారి జాతరలో భాగంగా తెప్పోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం వెనుక ఉన్న చెరువులో అమ్మవారి ప్రతిమను హంసాకార తెప్పపై ప్రతిష్టించి విహరింపజేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు మంగళ వాయిద్యాలు, భజనల మధ్య కార్యక్రమం జరగనుంది. భక్తుల భద్రత, సౌకర్యాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.