W.G: డిసెంబరు 31 నుంచి విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ 18వ అఖిలభారత మహాసభలు జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. కాళ్లలో ఆశా వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఇంటింటికి తిరిగి మహాసభలకు నిధివసూలు కార్యక్రమం ఇవాళ చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, శ్రామికవర్గం కోసం నిరంతరం పనిచేస్తున్న సీఐటీయూకి సహకరించాలని కోరారు.