CTR: వెంగంపల్లి గ్రామానికి చెందిన రైతు టీ. శాంతమ్మకు చెందిన ఆవు వన్యప్రాణుల దాడిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం తరపున రూ. 20,000 నష్టపరిహారం అందజేశారు. ఈ నష్టపరిహారాన్ని అటవీ శాఖ అధికారి (FRO) వారి ఆధ్వర్యంలో, FSO మోహనమురళి, FBO జేబీఅల్లా, VRO హేమాద్రి, మనోజ్ కుమార్లు వెంగంపల్లి గ్రామ సర్పంచ్ సమక్షంలో బాధిత రైతు టీ. శాంతమ్మకు అందజేశారు.