NRPT: ధన్వాడలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం సందర్శించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ రెండో విడత పోలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని సిబ్బందికి ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని, నిర్ణీత సమయంలోనే కౌంటింగ్ ప్రారంభించాలని ఆమె సూచించారు.