TG: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ చేరుకున్నాడు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు మెస్సీ వెళ్లనున్నాడు. అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నాడు.