మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీలలో రేపు రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.