‘అఖండ 2’ మూవీ పైరసీపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీలో ఉండగానే అఖండ 2 పైరసీ ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. ‘రవిని ఉరి తీయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కేవలం టికెట్ ధరలు పెంచుకోవాలి అంటే ఎలా కుదురుతుంది? అందుకే ప్రజలు ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు. సినిమా థియేటర్లలో అక్రమ వ్యాపారం, తినుబండారాలపై ధరలను అరికట్టాలి’ అని డిమాండ్ చేశారు.