VZM: శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో గల సంజీవిని హాస్పిటల్ నందు సీటీ స్కాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని తెలిపారు. అత్యున్నత అధునాతన పరికరాలతో కూడిన ఆస్పత్రి వైద్యసేవల్లో అందరి మన్ననలు అందుకోవాలన్నారు.