SRD: నారాయణఖేడ్ మండల పరిధిలోని బాణాపూర్కు చెందిన సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన బుడగజంగం సోదరులు ఖేడ్ MLA డా. పటోళ్ల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, రమేష్, శ్రీపతి లక్ష్మణ్, సుభాష్, కిష్టయ్య, సాయిలు, చిన్న పెంటయ్య, తాహేర్, తదితరులు పాల్గొన్నారు.