చలికాలం ఉదయాన్నే మంచుతో తడిసిన గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా? లేవగానే ఫోన్ చూడటం మానేసి.. ఓ 15 నిమిషాలు ఈ గడ్డిపై నడవండి. దీనివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. బీపీ, ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాదాలు భూమికి తగలడం వల్ల రక్తప్రసరణ బాగుంటుంది. నిద్ర కూడా బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటుతో ఆరోగ్యం మీ సొంతం.