ప్రకాశం: కనిగిరి సబ్ జైలు నిర్మాణం పూర్తి చేయుటకు నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ కోరారు. శనివారం సబ్ జైలు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కనిగిరిలో ఉన్నటువంటి సబ్ జైలు నిర్మాణానికి కొంత నిధులు మంజులయ్యాయని, ప్రస్తుతం నిధులు లేకపోవడంతో ఆగిపోయిందని వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు.