కేరళలో కమలం వికసించింది. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. 45 ఏళ్లుగా ఉన్న LDF కోట బద్దలైంది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేరళ రాజకీయాల్లో కీలక మలుపు అని.. జనం LDF, UDFతో విసిగిపోయారని అన్నారు. అభివృద్ధి కోసమే ప్రజలు NDAను గెలిపించారని తెలిపారు. అలాగే కార్యకర్తలను అభినందించారు.