SKLM: సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుడు కొమర రాజయ్య జీవనభృతి కోసం వేటకువెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందడంపట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం కోటబొమ్మాళి మండలం నిమ్మడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాద ఘటనపై మత్స్య శాఖ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.