AP: కోనసీమ జిల్లా అయినవిల్లి లంక భూముల్లో మొసళ్ల సంచారం కలకలం రేపింది. ఇటీవల వరదలకు కొట్టుకువచ్చిన 2 మొసళ్లు పొలాల్లోనే ఉండటంతో అటుగా వెళ్లేందుకు లంక గ్రామాల ప్రజలు జంకుతున్నారు. మొసళ్లను పట్టుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు వాటిని చర్యలు చేపట్టారు. ముందుగా అవి సంచరిస్తున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టారు.