AP: రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కరకంపాడులో పర్యటించిన ఆయన.. పలువురు రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ క్రమంలో తమ సమస్యలను వివరించిన రైతన్నలు.. ధాన్యం కొనుగోళ్లు నిలిచినట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై అధికారులను ప్రశ్నించిన ఆయన.. సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.