KRNL: కోడుమూరు జడ్పీ బాలుర పాఠశాలలో శనివారం జరిగిన నవోదయ పరీక్షకు 185 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 75 మంది గైర్హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ రామచంద్రుడు తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి అవకతవకులు లేకుండా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.