GDWL: గద్వాల మండల మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ శుక్రవారం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శనివారం జరిగిన ప్రతాప్ గౌడ్ అంత్య క్రియల్లో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, బల్గేర తిమ్మప్ప పాల్గొని పాడే మోశారు. అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని సంతాపం తెలిపారు.