MBNR: జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలో బీజేపీ బలపరిచిన పెద్దింటి యాదమ్మకు మద్దతుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాల త్రిపుర సుందరి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్ల నిర్మాణం, పీఎం కిసాన్, మరుగుదొడ్లు, వీధిదీపాలు, ఉపాధి హామీ, శ్మశానవాటికల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.