SKLM: ఈనెల 15న టెక్కలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. టెక్కలి ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ వేదికలో ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.