AP: మెడికల్ కాలేజీల విషయంలో YCP సంతకాల సేకరణ ఓ నాటకమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఇంతకంటే 151 నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయారో సంతకాలు సేకరిస్తే బాగుంటుందని విమర్శించారు. YCP హయాంలో విశాఖను గంజాయి హబ్‌గా మార్చారని, కూటమి పాలనలో విశాఖ అభివృద్ధిని చూసి ఆ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు.