ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరిలోని కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యతను, స్టోర్‌ను పరిశీలించారు. అనంతరం రూ.1.25 కోట్ల ఎస్ఎస్ఏ నిధులతో నిర్మిస్తున్న నూతన అదనపు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆమె అధికారులకు సూచించారు.