AP: గత ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమైందని, కూటమి పాలనలో అన్నీ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి TG భరత్ తెలిపారు. కర్నూలులో రూ.5 కోట్లతో నిర్మించిన దేవాదాయశాఖ పరిపాలన భవనాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. CM చంద్రబాబు నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.