ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అభిప్రాయపడ్డారు. అయితే, ఆ సాంకేతికతను నేర్చుకోవడానికి వెనకాడితే మాత్రం భవిష్యత్తు ఉండకపోవచ్చని తెలిపారు. స్థిరమైన, దీర్ఘకాలం పాటు వృత్తి జీవితాలను కొనసాగించే చివరి తరం మనదే అవుతుందన్నారు. మనం ఇప్పుడు రోజూ పోరాటం చేయాల్సిందేనని.. కొత్త విషయాలను నేర్చుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు.