VZM: విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే ద్వారా ప్రస్తుత ప్రాజెక్టుల స్టేటస్‌ను అడిగి తెలుసుకున్నారన్నారు. ఉత్తరాంధ్రను ఏఐ, డేటా హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలు హర్షనీయమన్నారు.