VSP: జడ్జి కోర్టు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను సినీ నటి అనసూయ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనసూయ సందడి చేయగా, అభిమానులు భారీగా తరలివచ్చారు. నగరంలో సంస్థ విస్తరణలో భాగంగా ఈ కొత్త బ్రాంచ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.