టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ భారత్కు చేరుకున్నారు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, భారత పర్యటనలో ఉన్న అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని కలవడానికే విరుష్క దంపతులు స్వదేశానికి వచ్చారని అభిమానులు భావిస్తున్నారు.