MBNR: కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ 1వ వార్డు అభ్యర్థి నారాయణ గౌడ్ తన ఎన్నికల గుర్తు ‘గౌను’ను ప్రచారం కోసం వినూత్నంగా ఉపయోగించారు. గుర్తు అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆయన గౌను ధరించి తమ వార్డులో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఈ ప్రచార పద్ధతి స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ గౌడ్ ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు.