ముంబై హిట్-అండ్-రన్ కేసులో నిందితుడు మిహిర్ షాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అతడికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ‘ఇలాంటి అబ్బాయిలకు గుణపాఠం చెప్పాల్సిందే.. చేసిన తప్పుకు కొన్నాళ్లు జైల్లో ఉండాల్సిందే’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. శివసేన మాజీ లీడర్ కొడుకైన మిహిర్.. 2024లో కారుతో బైక్ను ఢీకొట్టి పారిపోయిన సంగతి తెలిసిందే.