శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తిరుమలలోని హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని ఈవో శ్రీ శ్యామల రావు పునరుద్ఘాటించారు. ఇందుకోసం ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు మరియు హోటల్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్ యజమానులందరూ ఫుడ్ సేఫ్టీ విభాగం సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలన్నారు. డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో కూడా అధికసంఖ్యలో భక్తులు అన్నప్రసాదం గురించి అడగగా… శ్రీవారి అన్నప్రసాదం రుచి, నాణ్యతపై ప్రత్యేక దృష్టి ఈఓ చెప్పారు