»Ttd Break Darshans In Tirumala Are Canceled On These Two Dates
TTD: ఈ రెండు తేదీల్లో తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వీఐపీలకు రెండు రోజులు బ్రేక్ దర్శనాలు లేవని టీటీడీ ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ముందు రోజు సిఫారసు లేఖలు స్వీకరించబడవని వెల్లడించారు. ఆ డేట్స్ ఏంటో తెలుసుకోండి.
TTD: Break darshans in Tirumala are canceled on these two dates
TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునే వీఐపీలకు రెండు రోజులు బ్రేక్ దర్శనాలు లేవని టీటీడీ ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ముందు రోజు సిఫారసు లేఖలు స్వీకరించబడవని వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో ఈనెల 9, 16వ తేదీల్లో బ్రేక్దర్శనాలను (Break darsan) రద్దు చేస్తూ టీటీడీ(TTD) ఓ ప్రకటనలో తెలిపింది. జూలై 9న ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. అలాగే జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం వేడుక ఉంది. అందుకనే ఈ రెండు తేదీలలో బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. దీనికోసం జూలై 8, 15వ తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబడవని వెల్లడించింది.
ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు(EO Shyamalarao) , జేఈవో వీరబ్రహ్మం లడ్డూ పోటు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో ఆ ముఖ్యమైన రోజుల్లో నిర్వహించే కార్యక్రమాల గురించి చర్చించారు. గోకులం విశ్రాంతి భవనంలో ఈ సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా వైష్ణవ బ్రాహ్మణ , వైష్ణవ బ్రాహ్మణేతర వర్గాల్లోని లడ్డూల తయారీ కోసం వారి జాబ్‌చార్ట్, వారి వివరాలను తెలుసుకొన్నారు. వారు చేసే బూందీ ఫ్రై, షుగర్ సిరప్, జీడిపప్పు ఫ్రై, బూందీ మిక్సింగ్, లడ్డు మౌల్డింగ్, ట్రే లిఫ్టింగ్, కన్వేయర్ బెల్ట్, ప్రసాదం పంపిణీ తదితర వాటిని పవర్ ప్రజంటేషన్ చేసి అధికారులకు వివరించారు.