HYD: ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 2,000కి పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరతతో సహాయక చర్యలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. వాహనాలు, పరికరాల కొరత కూడా సమస్యగా మారింది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.