WGL: జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలైన వారు, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరో అవకాశం కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆశావహులు వివిధ రాజకీయ పార్టీల పెద్దల వద్దకు వెళ్లి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.