GDWL: జిల్లా ప్రజలు రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలని ఆదివారం జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు సూచించారు. రోడ్డు నియమాలు పాటించకుండా వాటిని అతిక్రమించి, వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా, మైనర్లు డ్రైవింగ్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వాహనాలు నడిపితే అట్టి వాహనాలు సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.