GNTR: కొల్లిపర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 25న హల్చల్ చేసిన నిందితులు సాయి, అబ్దుల్ కరీం, శ్రీనులను పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యనారాయణ అనే వ్యక్తిపై దాడికి దిగిన నిందితులు, అడ్డువచ్చిన సెక్యూరిటీ గార్డులు తిరుపతిరావు, రమాదేవిలను చితకబాదారు. అలాగే ఆసుపత్రి అద్దాలను పగులగొట్టి విధ్వంసం సృష్టించారు. ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి ఆదివారం అరెస్ట్ చేశారు.