ATP: గుత్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులు వాసవి మాల దీక్షలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాకం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ మాల 21 రోజులు ధరిస్తున్నట్లు తెలిపారు.