NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా B.Ed, B.P.Ed మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలకు ఇవాళే చివరి తేదీ అని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. విద్యార్థులు అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు రూ. 100 అపరాధ రుసుముతో నేడు ఫీజు చెల్లించవచ్చన్నారు. సెమిస్టర్ పరీక్షలు జనవరిలో నిర్వహిస్తామన్నారు.