BHPL: గొర్లవీడులో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ మందల లావణ్య-విద్యాసాగర్ రెడ్డి హాజరై గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని పశుపాలకులు తమ గొర్రెలు, మేకలకు నట్టల మందులు వేయించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.