HNK: గత పదేళ్లలో గోపాలపూర్ చెరువు రూపురేఖలు మారిపోయాయని, చెరువు పరిసరాలు అన్యాక్రాంతమయ్యాయని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యే మాట్లాడుతూ… భారీగా వచ్చిన వరదతో చెరువు కట్ట తెగి అనేక కాలనీలు నీట మునిగాయని పేర్కొన్నారు. ఇండ్లు నీట మునిగి ఒక్కో ఇంటికి సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లిందన్నారు.