NTR: జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఆటో నగర్‌కు చెందిన వ్యాపారులు, స్థానిక ప్రజలు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రసాయన కర్మాగారాల వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, వాయు కాలుష్యం పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కారణంగా తాగునీరు ఉపయోగించలేని పరిస్థితి నెలకొందన్నారు.