NGKL: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. కొల్లాపూర్ రేంజ్ మొలచింతలపల్లి బీట్ పరిధిలోని మేదరబండ సమీపంలో ఉన్న ‘దేవుని బొక్క’ ప్రాంతంలో కొంతమంది తవ్వకాలు జరుపుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అర్ధరాత్రి వేళ ఫారెస్ట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, తవ్వకాలు చేపడుతున్న పలువురిని అరెస్టు చేశారు.