ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు నియంత్రణలో వున్నాయని CP సునీల్ దత్ తెలిపారు. వార్షిక నివేదిక-2025ను సీపీ సోమవారం వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే చోరీ సొత్తు రికవరీ 9%, నేరాలను ఛేదించడం 11% పెరిగిందన్నారు. లోక్ ఆదాలత్ ద్వారా 36,709 కేసుల పరిస్కారం లభించిందన్నారు. ఈ ఏడాది 928 రోడ్డు ప్రమాదాలలో 332 మంది మృతి చెందగా.. 809 మంది గాయపడ్డారన్నారు.